తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో 60 మందికి పైగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
- ఇంటర్ మెమోలలో తప్పుగా ప్రింట్ అయిన ఫొటోలు
- పలు ఇంజినీరింగ్ కాలేజీలలో చేరిన బాధిత విద్యార్థులు
- బీటెక్ కాలేజీలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత విద్యార్థులు
మరోవైపు, ఫొటోలు తప్పుగా ప్రింట్ కావడంపై డీఈవో వెంకటరమణ మాట్లాడుతూ... ఇందులో తమవైపు నుంచి ఎలాంటి తప్పిదం లేదని... తప్పును ఇంటర్ బోర్డు సరిచేయాల్సి ఉందని చెప్పారు. ఈ విద్యార్థులంతా వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరినప్పటికీ... మెమోలు సరిగా లేకపోవడంతో కాలేజీలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే స్పందించి మెమోలను సరిచేయాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు.