ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పటీదార్.. కోహ్లీ ఏమన్నాడంటే..!
- ఆర్సీబీ కొత్త సారథిగా రజత్ పటీదార్
- ఈ మేరకు తాజాగా ఫ్రాంచైజీ ప్రకటన
- రజత్ కెప్టెన్గా ఎంపిక కావడంపై కోహ్లీ స్పెషల్ వీడియో
- ఆర్సీబీ కెప్టెన్సీకి అతడు అన్ని విధాలా అర్హుడన్న రన్ మెషీన్
ఇక ఆర్సీబీకి కొత్త సారథిగా రజత్ పటీదార్ ఎంపిక కావడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషల్ వీడియో విడుదల చేశాడు. రన్ మెషీన్ మాట్లాడుతూ... "రజత్ పటీదార్ ముందుగా నేను నిన్ను అభినందిస్తున్నా. నీకు శుభాకాంక్షలు. ఈ ఫ్రాంచైజీలో నువ్వు ఎదిగిన విధానం, నీవు ప్రదర్శించిన తీరుతో భారతదేశం అంతటా ఉన్న ఆర్సీబీ అభిమానులందరి హృదయాల్లో నువ్వు నిజంగా చోటు సంపాదించుకున్నావు. ఇకపై నీ ఆటను చూడటానికి వాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కెప్టెన్సీకి నువ్వు అన్ని విధాలా అర్హుడవు. నాతో పాటు జట్టు సభ్యులందరం నీవెంటే ఉంటాం. మా అందరి మద్దతు నీకు ఉంటుంది" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.