కులగణన మరోసారి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై స్పందించిన కేటీఆర్
- అసంపూర్తి లెక్కలతో అసెంబ్లీలో తీర్మానం చేసిందని విమర్శ
- అలా చేయడం తప్పేనని ప్రభుత్వం అంగీకరించాలని డిమాండ్
- 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న కేటీఆర్
ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ, అసంపూర్తి లెక్కలతో అసెంబ్లీలో తీర్మానం చేయడం తప్పేనని ప్రభుత్వం అంగీకరించాలని కేటీఆర్ అన్నారు. బీసీలను తీవ్ర మనోవేదనకు గురి చేశారని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రెండోసారైనా కుల గణన సర్వేను సమగ్రంగా, పారదర్శకంగా చేయాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టివేస్తే అంగీకరించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.