మధ్యప్రదేశ్ కు వన్యప్రాణి సంరక్షణ అవార్డు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మధ్యప్రదేశ్ కు వన్యప్రాణి సంరక్షణ అవార్డు

వన్యప్రాణి రక్షణ అవార్డును మధ్యప్రదేశ్ రాష్ట్రం దక్కించుకుంది. ప్రముఖ ఆంగ్ల పత్రిక లోన్లీ ప్లానెట్ ఆన్ లైన్లో ఏర్పాటు చేసిన సర్వేతో మధ్యప్రదేశ్ ను ఈ అవార్డు వరించింది. బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ మధ్యప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మోహన్ యాదవ్ కు ఈ అవార్డు బహూకరించాడు. అవార్డు ప్రదానం చేసిన లోన్లీ ప్లానెట్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ '25 అభయారణ్యాలు, 9 జాతీయ పార్కులు కలిగిన మధ్యప్రదేశ్ వన్యప్రాణుల రక్షణకు ఎనలేని సేవలు చేస్తోంది. ఈ అవార్డుకు పూర్తి అర్హత కలిగిన రాష్ట్రమది' అంటూ ప్రశంసలు కురిపించారు.

More Telugu News