తెలంగాణలో మందుబాబులకు షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు
- అన్ని బ్రాండ్ల బీర్ల ధరలు 15 శాతం పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు
- రిటైర్ట్ జడ్జ్ జైస్వాల్ కమిటీ సిఫారసు మేరకు ప్రభుత్వ నిర్ణయం
- పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమలు
అన్ని రకాల బీర్ల బ్రాండ్ల ధరలను 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మార్పీ ధరపై 15 శాతం పెంచి బీర్లను విక్రయిస్తారు. పెరిగిన ధరలతో ప్రస్తుతం రూ. 150గా ఉన్న కింగ్ ఫిషర్ ప్రీమియం బీర్ ధర రూ. 180కి చేరుకునే అవకాశం ఉంది. కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ ధర రూ. 160 నుంచి రూ. 190కి పెరగొచ్చు. అయితే, బీర్ల ధరలు సరిగ్గా ఎంత పెరుగుతాయనే విషయంలో ఈరోజు క్లారిటీ రానుంది. ఇది నిజంగా బీర్ ప్రియులకు కిక్కు దిగిపోయే వార్తే.