కేటీఆర్‌కు నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుండి ప్రత్యేక ఆహ్వానం
- ఏప్రిల్ 19న జరిగే ఐబీసీ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆహ్వానం
- పెట్టుబడులను ఆకర్షించేందుకు కేటీఆర్ కృషి చేశారని ప్రశంస
- హైదరాబాద్‌ను ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని కితాబు
పదేళ్ల పాలనలో తెలంగాణకు ప్రముఖ కంపెనీల నుండి పెట్టుబడులను ఆకర్షించడంలో కేటీఆర్ చేసిన కృషి అద్భుతమని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ఈ సందర్భంగా కొనియాడింది. హైదరాబాద్‌ను ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని ప్రశంసించింది. తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం స్ఫూర్తిదాయకమని పేర్కొంది.