రతన్ టాటా వీలునామాలో.. రహస్య వ్యక్తికి రూ. 500 కోట్లు!
- వేల కోట్ల రూపాయల ఆస్తిని సోదరుడు జిమ్మీ టాటాతో పాటు తన సహాయకులకు వీలునామా రాసిన టాటా
- మోహన్ దత్తా అనే వ్యక్తికి రూ. 500 కోట్లు రాశారంటున్న మీడియా వర్గాలు
- ట్రావెల్ ఏజెన్సీని నిర్వహిస్తున్న మోహన్ దత్తా
జంషెడ్ పూర్ కు చెందిన ట్రావెల్స్ వ్యాపారి మోహన్ దత్తానే ఆ రహస్య వ్యక్తి అని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా వద్ద ఆరు దశాబ్దాలకు పైగా మోహన్ దత్తా నమ్మకంగా పని చేశారు. దత్తాకు చెందిన 'స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ' 2013 నుంచి తాజ్ సర్వీసెస్ తో కలిసి పని చేస్తోంది.
టాటా గ్రూప్ అధికారులు చెపుతున్న వివరాల ప్రకారం... టాటా కుటుంబానికి దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారు. రతన్ టాటా మరణించినప్పుడు ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి దత్తా మాట్లాడుతూ... టాటా తనకు 24 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. తాను జీవితంలో ఎదగడానికి టాటా ఎంతో సాయం చేశారని తెలిపారు.