ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ
- పలు నిర్ణయాలకు ఆమోదం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచే పాలసీకి ఆమోదం
ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్-2025కి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో, సుమారు రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ సమ్మతి తెలిపినట్టు తెలుస్తోంది. గతంలో పెండింగ్ లో ఉన్న నీరు-చెట్టు పనుల బిల్లుల చెల్లింపునకు ఆమోదం లభించినట్టు సమాచారం. ఇక, మద్యం ధరలపైనా, పోలవరం నిర్వాసితులకు కొత్త ఇళ్లు నిర్మించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.