Chandrababu: వాహనశ్రేణిలోని డ్రైవర్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

CM Chandrababu Pay Tributes to Convoy Driver Dead
షార్ట్స్‌లో చూడండి
సీఎం చంద్ర‌బాబు వాహనశ్రేణిలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు. అమీన్ బాబు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్‌లోని వాహనశ్రేణిలో డ్రైవర్‌గా సుదీర్ఘకాలంగా అమీన్ బాబు విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున అమీన్ మృతి చెందారు. 

విషయం తెలుసుకున్న సీఎం చంద్ర‌బాబు.. డ్రైవ‌ర్ అమీన్ బాబు మృతిప‌ట్ల‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు. ప్రభుత్వ పరంగా అమీన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
CM Convoy

More Telugu News