ట్రేడ్ వార్: ట్రంప్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన చైనా
- రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్
- వివిధ దేశాలపై వాణిజ్య టారిఫ్ ల సవరణ
- చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 శాతం సుంకం పెంపు
- అమెరికా ఉత్పత్తులపై 15 శాతం సుంకం పెంచిన చైనా
దీనిపై చైనా కూడా దీటుగా స్పందించింది. అమెరికా నుంచి తమ దేశానికి వచ్చే బొగ్గు, ద్రవరూప సహజ వాయువులపై 15 శాతం సుంకం విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా, అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ పైనా చైనా విచారణకు ఆదేశించింది.
దీనిపై చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. టారిఫ్ లు పెంచుతూ అమెరికా తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇలాంటి నిర్ణయాలు అమెరికా సమస్యలను పరిష్కరించలేవని... ఇటువంటి వైఖరి చైనా-అమెరికా మధ్య సాధారణ ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని బలహీనపరుస్తుందని వివరించింది.