'సంక్రాంతికి వ‌స్తున్నాం' క‌లెక్ష‌న్ల సునామీ... ఇండ‌స్ట్రీ రికార్డు నెలకొల్పిన వెంకీమామ!

 Sankranthiki Vasthunam Movie Collects Rs 303 Crore
  • విక్ట‌రీ వెంకటేశ్‌, అనిల్ రావిపూడి కాంబోలో 'సంక్రాంతికి వ‌స్తున్నాం'  
  • గ‌త‌ నెల 14న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన మూవీకి సూప‌ర్ హిట్ టాక్
  • ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రానికి రూ. 303 కోట్లు వ‌చ్చిన‌ట్లు తాజాగా మేక‌ర్స్ ప్ర‌క‌టన‌
  • రీజ‌న‌ల్ ఫిల్మ్ కేట‌గిరీలో ఈ చిత్రం ఆల్‌టైమ్ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింద‌ని పోస్ట‌ర్ విడుద‌ల
సంక్రాంతి కానుక‌గా గ‌త‌ నెల 14న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన 'సంక్రాంతికి వ‌స్తున్నాం' మూవీ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. విడుద‌లై 20 రోజులు కావొస్తున్నా కలెక్ష‌న్లు మాత్రం స్ట‌డీగా కొన‌సాగుతున్నాయి. వీకెండ్స్‌లో థియేట‌ర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో వ‌సూళ్ల ప‌రంగా ఈ సినిమా ప‌లు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంటోంది. 

ఇక ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రానికి రూ. 303 కోట్లు వ‌చ్చిన‌ట్లు తాజాగా మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. రీజ‌న‌ల్ ఫిల్మ్ కేట‌గిరీలో ఈ చిత్రం ఆల్‌టైమ్ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింద‌ని పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. 

అనిల్‌ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన‌ ఈ సినిమాకు భీమ్స్ అద్భుత‌మైన సంగీతం అందించారు. మూవీ ఆల్బ‌మ్‌లోని దాదాపు అన్ని పాట‌లు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. వెంకీమామ‌ స‌ర‌స‌న‌ ఐశ్వ‌ర్య రాజేశ్‌, మీనాక్షి చౌద‌రి క‌థానాయిక‌లుగా న‌టించారు. 
Advertisement
Sankranthiki Vasthunam
Venkatesh Daggubati
Anil Ravipudi
Tollywood

More Telugu News