ఈ బడ్జెట్ తో మధ్య తరగతి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు: విజయసాయిరెడ్ది
- నిన్న కేంద్ర బడ్జెట్ ప్రకటన
- రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
- మిడిల్ క్లాస్ బడ్జెట్ గా ఇది గుర్తుండిపోతుందన్న విజయసాయి
ఈ ఏడాది ప్రకటించిన బడ్జెట్ 'మిడిల్ క్లాస్ బడ్జెట్' గా గుర్తుండిపోతుందని తెలిపారు. పైగా ఇది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రికార్డు స్థాయిలో 8వ బడ్జెట్ అని వెల్లడించారు. ఈ బడ్జెట్ తో దేశంలో మధ్య తరగతి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఆదాయ పన్ను ఊరట, కస్టమ్స్ సుంకాలు తగ్గించడం, దృఢమైన ఆర్థిక సంస్కరణలతో... కష్టించి పనిచేసే కుటుంబాలకు ఈ బడ్జెట్ సాధికారత కల్పిస్తుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి పథాన్ని మరింత బలోపేతం చేస్తుందని వివరించారు.