పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్ర బడ్జెట్ లో ఎంత కేటాయించారంటే...!
- కేంద్ర బడ్జెట్ లో పోలవరంను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్
- బ్యాలెన్స్ గ్రాంట్ గగా రూ. 12,157.53 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు వెల్లడి
- ప్రాజెక్ట్ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని వ్యాఖ్య
2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కేంద్రంలో కూడా రాష్ట్ర కూటమి కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కూడా రూ. 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.