వర్రా రవీంద్రా రెడ్డి కేసు హైదరాబాద్ నుంచి పులివెందులకు బదిలీ
- వైఎస్ సునీతపై అనుచిత పోస్టులు పెట్టిన రవీంద్రా రెడ్డి
- సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సునీత ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డి కేసుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పులివెందులకు బదిలీ చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతను చంపుతామంటూ గత ఏడాది వర్రా రవీంద్రా రెడ్డి పోస్టులు పెట్టారు. అంతేకాదు ఆమెపై అసభ్యకరమైన పోస్టులు కూడా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసు పులివెందులకు బదిలీ చేశారు. ఈ కేసును పరిశీలించిన పులివెందుల పోలీసులు ఆయనపై కొత్తగా మరో కేసు నమోదు చేశారు. రవీంద్రా రెడ్డి ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.