కుమారస్వామి కాన్యాయ్ లో ప్రమాదం... దెబ్బతిన్న జీవీఎల్ నరసింహారావు కారు
- విశాఖ పర్యటనకు వచ్చిన కుమారస్వామి
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళుతుండగా కాన్వాయ్ లో ప్రమాదం
- స్వల్పంగా దెబ్బతిన్న కాన్వాయ్ లోని మూడు వాహనాలు
అక్కడి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళుతున్న సమయంలో కాన్వాయ్ లోని మూడు వాహనాలు ఒకదానితో మరొకటి గుద్దుకున్నాయి. మొత్తం ఎనిమిది వాహనాల కాన్వాయ్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ వాహనాల్లో ఒకటి మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుది కావడం గమనార్హం. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.