ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి కోర్టులో ఊరట
- లోక్ సభ ఎన్నికలకు ముందు అతిశీ తీవ్ర ఆరోపణలు
- బీజేపీలో చేరకుంటే ఈడీ అరెస్ట్ చేస్తుందని కాషాయ నేతలు చెప్పారన్న అతిశీ
- ఈ వ్యాఖ్యలపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రవీణ్ శంకర్ కపూర్ ఆమెపై కోర్టులో పరువు నష్టం పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఈ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. విచారణ జరిపిన న్యాయస్థానం అతిశీ ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, పార్టీని ఉద్దేశించి చేశారని పేర్కొంటూ పరువు నష్టం పిటిషన్‌ను కొట్టి వేసింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అతిశీకి కోర్టులో ఊరట లభించింది.