గ్రూప్-1 మెయిన్స్ తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ
- మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్
- మెయిన్స్ కు అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు
- ఈసారి ట్యాబ్ లలో ప్రశ్నాపత్రం
2023 డిసెంబరులో 89 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. అయితే, ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో మెయిన్స్ పరీక్షలు మేలో నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖ, అమలాపురం, విజయవాడ, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.