నటీనటులపై వ్యాఖ్యలు... క్షమాపణలు చెప్పిన వేణుస్వామి
- నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో వేణుస్వామి వ్యాఖ్యలు
- వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వేణుస్వామి వెల్లడి
- మహిళా కమిషన్‌కు వెళ్లి క్షమాపణలు
నటీనటులపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలకు గాను రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మహిళా కమిషన్ నోటీసులను వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. అయితే మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈరోజు తెలంగాణ మహిళా కమిషన్‌కు వచ్చిన వేణుస్వామి క్షమాపణలు చెప్పారు.