ట్రంప్ టారిఫ్ భయం... మార్కెట్ పతనంతో ఒక్కరోజే రూ.7 లక్షల కోట్లు ఆవిరి

ట్రంప్ టారిఫ్ భయం... మార్కెట్ పతనంతో ఒక్కరోజే రూ.7 లక్షల కోట్లు ఆవిరి

Rs 7 lakh crore gone on Trump tariff threat
  • 1,235 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • రూ.7 లక్షల కోట్లు క్షీణించి రూ.424 కోట్లకు పడిపోయిన ఇన్వెస్టర్ల సంపద
  • మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిన ట్రంప్ టారిఫ్ ప్రకటన
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 1,235 పాయింట్లు, నిఫ్టీ 299 పాయింట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 76 వేల పాయింట్ల దిగువకు పడిపోయి 75,838 వద్ద ముగియగా, నిఫ్టీ 23,045 పాయింట్ల వద్ద స్థిరపడింది. 

సెన్సెక్స్ ఓ సమయంలో 1,300 పాయింట్ల మేర నష్టపోయింది. చివరలో కాస్త కోలుకున్నప్పటికీ భారీ నష్టాల్లోనే ముగిసింది. మార్కెట్ కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.7 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.424 లక్షల కోట్లకు పడిపోయింది.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై ట్రేడ్ టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. భారత్ సహా ఇతర దేశాలపై సుంకాలు విధిస్తామని గతంలోనే చెప్పారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

దేశీయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, జొమాటో వంటి దిగ్గజ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికాలో డాలర్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. దీంతో మన మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. మరోవైపు, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Advertisement
Stock Market
Business News
India

More Telugu News