వేటు పడింది.. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు
- అమెరికా సహా 30 దేశాల్లో జన్మతః పౌరసత్వ చట్టం
- ఇకపై ఇలాంటి వెసులుబాటు లేకుండా చేసిన ట్రంప్
- జన్మతః పౌరసత్వాన్ని అందించే చట్టం రద్దు చేస్తూ ఆదేశాలు
అమెరికాలో 1868 నుంచే ఈ చట్టం అమల్లో ఉంది. దేశంలో అంతర్యుద్ధం అనంతరం 14వ రాజ్యాంగ సవరణ తర్వాత శరణార్దుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు, స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి కూడా జన్మతః పౌరసత్వం లభిస్తోంది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో జన్మతః పౌరసత్వం ఇక లేనట్టే. అయితే, ట్రంప్ నిర్ణయం తీసుకున్నప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.