సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కేసు... మహిళా కమిషన్ ఎదుట హాజరైన కాలేజీ బృందం

  • విచారణ కమిషన్ ఎదుట హాజరైన ప్రిన్సిపల్, తదితరులు
  • సీక్రెట్ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ప్రశ్నించారన్న ప్రిన్సిపల్
  • ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తామని స్పష్టీకరణ
మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లోని బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఘటన సంచలనం రేపింది. దీనికి సంబంధించి కాలేజీ ప్రిన్సిపల్‌తో సహా ఏడుగురిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది.

దీంతో కాలేజీ బృందం ఈరోజు మహిళా కమిషన్ ఎదుట హాజరైంది. సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన మహిళా కమిషన్... విచారణ జరిపింది. ఈ క్రమంలో సీఎంఆర్ కాలేజీ బృందం మహిళా కమిషన్ ఎదుట హాజరైంది.

విచారణకు హాజరైన అనంతరం కాలేజీ ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడుతూ... మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఎదుట విచారణకు హాజరయ్యామని, సీక్రెట్ కెమెరాల ఘటనకు సంబంధించి వివరాలు అడిగారని తెలిపారు. ఎప్పుడు విచారణకు పిలిచినా వెళతామన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.


More Telugu News