సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
- అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం కేసు
- పరువునష్టం కేసు వేసిన బీజేపీ కార్యకర్త
- బాధిత వ్యక్తి మాత్రమే పరువునష్టం కేసు వేయగలరన్న రాహుల్ తరపు న్యాయవాది
రాహుల్ గాంధీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. రాహుల్ తరపున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. బాధిత వ్యక్తి మాత్రమే పరువునష్టం కేసు వేయగలరని... ప్రాక్సీ పార్టీ ద్వారా ఫిర్యాదు చేయలేమని చెప్పారు. ఇదే విషయాన్ని న్యాయస్థానాలు అనేక తీర్పుల ద్వారా వెల్లడించాయని తెలిపారు.