ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఫేస్ బుక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఫేస్ బుక్!

మనిషి ఆనందంగా ఉండడానికి కారణాలెన్నో. అలాంటి వాటిలో ఇప్పుడు సామాజిక్ వెబ్ సైట్ ఫేస్ బుక్ కూడా ఒకటిగా నిలుస్తోంది. ఆ విషయాన్ని మనం అనుకోవడం కాదు. ప్రఖ్యాత కాలిఫోర్నియా యూనివర్శిటీ జరిపిన పరిశోధనలో తేలిన నిజం. ఫేస్ బుక్ లో అప్ డేటెడ్ గా ఉన్న జంటలు హ్యాపీగా ఉన్నాయని తేలింది. ఈ యూనివర్శిటీలో మెడిసిన్ విభాగానికి చెందిన లారా ఆర్ సాస్లా ఈ పరిశోధనకు సారధ్యం వహించారు. ఫేస్ బుక్ ఉపయోగిస్తున్న కొంతమంది జంటలను ఈ పరిశోధన కోసం లారా తీసుకున్నారు. మూడు విభాగాలుగా విభజించి జరిపిన ఈ పరిశోధనలో తమకు సంబంధించిన ఏ విశేషమైనా ఫేస్ బుక్ లో పరస్పరం షేర్ చేసుకోవడం వల్ల వారు సంతోషంగా ఉన్నట్లు తెలిసింది. ఫేస్ బుక్ లో తమకు సంబంధించిన అప్ డేట్స్ చూసుకోవడం వల్ల తమ జీవితంలో సంతోషం ఎక్కువగా ఉంటోందని కొంతమంది తెలిపారు. తమ పిల్లల ఎదుగుదల, పరిచయం నాటి గుర్తులు ఫేస్ బుక్ లో చూసుకొని మురిసిపోతున్నాయట చాలా జంటలు.

More Telugu News