మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులా... అయితే ఇది మీ కోసమే!
ఈ నెల 24వ తేదీ రాత్రి పది గంటల నుండి 25 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు చాట్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఐవీఆర్ సేవలు అందుబాటులో ఉండవని బ్యాంకు తెలిపింది. అలాగే, కరెంటు ఖాతాలు, సేవింగ్ ఖాతాలు, రూపే క్రెడిట్ కార్డ్, మొబైల్ బ్యాంకింగ్‌తో పాటు యూపీఐ సేవలపైనా ఈ ప్రభావం ఉంటుందని, ఖాతాదారులు సహకరించాలని కోరింది. బ్యాంకు సేవల అంతరాయానికి సంబంధించిన సమాచారాన్ని ఖాతాదారులకు ఇప్పటికే తెలియజేసినట్టు పేర్కొంది.