ఇప్పటి వరకు 8.70 లక్షల మంది రక్తదానం చేశారు: నారా భువనేశ్వరి
- ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్న భువనేశ్వరి
- ఎన్టీఆన్ సేవలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఏర్పాటు చేశామని వెల్లడి
- ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్లో ఉచిత విద్య, వసతి అందిస్తున్నామన్న భువనేశ్వరి
ఎన్టీఆర్ ప్రతి వర్ధంతికి లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని భువనేశ్వరి తెలిపారు. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు, మరొకరి జీవితంలో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ట్రస్టుకు 8.70 లక్షల మంది రక్తదానం చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని అందించామని చెప్పారు. హైదరాబాద్ చర్లపల్లిలోని ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్లో ఉచిత విద్య, వసతి, భోజనం కల్పిస్తున్నామని తెలిపారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నామని చెప్పారు. కరోనా, తుపాన్ల సమయంలో అనేక సేవలు అందించామని వెల్లడించారు.