వరి పొలంలో మందు పిచికారి చేసిన మంత్రి.. వీడియో ఇదిగో!
--
వ్యవసాయం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పే నిమ్మల.. తొలినాళ్లలో కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. అప్పుడు కూడా తీరిక దొరికిన సమయంలో పొలం పనులు చేసేవారు. ఓవైపు లెక్చరర్ గా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే వ్యవసాయం చేసి ఎకరాకు 55 బస్తాల దిగుబడి తీశానని మంత్రి చెప్పారు. పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాబినెట్ లోకి తీసుకుని జలవనరుల శాఖ అప్పగించారు.