రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటన ఖరారు
- ఈ నెల 27న తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్, ఖర్గే
- 'సంవిధాన్ బచావో' కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్ర నేతలు
- రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందంటూ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లేఖ రాశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం విస్తృతమైన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.