వారికి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వార్నింగ్‌.. జేసీబీల‌తో నేల‌మ‌ట్టం చేస్తామ‌న్న టీడీపీ నేత‌

  • యాడికి వాసుల‌కు టీడీపీ సీనియ‌ర్ నేత హెచ్చ‌రిక‌
  • ఆల‌య కుంట‌ను క‌బ్జా చేసిన వారిని వ‌దిలిపెట్ట‌బోమ‌న్న జేసీ
  • ప‌ట్ట‌ణ అభివృద్ధి కోసం అక్ర‌మ నిర్మాణాల‌ను జేసీబీల‌తో నేల‌మ‌ట్టం చేస్తామ‌ని వాఖ్య‌
టీడీపీ సీనియ‌ర్ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి యాడికి వాసుల‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆల‌య కుంట‌ను క‌బ్జా చేసిన వారిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ వ‌దిలిపెట్ట‌బోమ‌ని హెచ్చ‌రించారు. ప‌ట్ట‌ణ అభివృద్ధి కోసం అక్ర‌మ నిర్మాణాల‌ను జేసీబీల‌తో నేల‌మ‌ట్టం చేస్తామ‌ని అన్నారు. 

గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆల‌య కుంట భూమిలో ఎక్క‌డ‌పడితే అక్క‌డ అక్ర‌మ నిర్మాణాలు నిర్మించార‌ని జేసీ ఆరోపించారు. ఇండ్ల‌ను నిర్మించిన వారి వ‌ద్ద ఏమైనా ప్ర‌భుత్వ అధికారిక రికార్డులు ఉంటే తీసుకురావాల‌ని అన్నారు. లేనిప‌క్షంలో ఏ పార్టీ వారైనా ఉపేక్షించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. అక్ర‌మ నిర్మాణాల‌ను జేసీబీల‌తో కూల్చివేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. 


More Telugu News