పటిష్ఠ బందోబస్తు మధ్య మణికొండలో హైడ్రా కూల్చివేతలు
- నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- స్థానికులు కబ్జాకు పాల్పడ్డారని తెలిసి రంగంలోకి దిగిన అధికారులు
- హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో చర్యలు
కాగా, నగరంలోని చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతూ, కబ్జాకోరుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చర్యలను మరింత విస్తృతంగా, పకడ్బందీగా చేపట్టేందుకు పటిష్ఠమైన చర్యలు కూడా తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘గ్రీవెన్స్ డే’ ద్వారా సామాన్య జనాల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. అంతేకాదు, ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను కూడా హైడ్రా ఏర్పాటు చేసింది. బుద్ధ భవన్‌లోని బీ-బ్లాక్ కేంద్రంగా ఈ పోలీస్ స్టేషన్ కార్యకలాపాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.