ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు

CM Revanth Reddy Australia tour canceled
  • ఈ నెల 14న ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి
  • 14, 15, 16 తేదీల్లో దేశ రాజధానిలో సీఎం పర్యటన
  • 17 నుంచి సింగపూర్, 19 నుంచి దావోస్‌లో పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దైంది. ఈ నెల 14న ఢిల్లీకి వెళుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మూడు రోజులు కొనసాగనుంది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆయన దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. 15న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు.

అయితే, ఈ నెల 17న ఆయన ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటిస్తారు. ఆ తర్వాత 19న సింగపూర్ నుంచి దావోస్ వెళ్లనున్నారు. 23వ తేదీ వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana

More Telugu News