కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీకి రిమాండ్
- గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
- ఇప్పటికే రిమాండ్ లో ఉన్న 13 మంది వైసీపీ కార్యకర్తలు
- ఈ నెల 10 వరకు కాళీకి రిమాండ్ విధించిన కోర్టు
ఈ కేసులో ఇప్పటికే 13 మంది వైసీపీ కార్యకర్తలు రిమాండ్ లో ఉన్నారు. అసోంలో ఉన్న కాళీని పోలీసు బృందాలు అరెస్ట్ చేసి గుడివాడకు తీసుకొచ్చాయి. వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం కాళీని కోర్టులో ప్రవేశపెట్టగా... ఈ నెల 10వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. వెంటనే కాళీని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.