నాని సినిమా 'హిట్ 3' షూటింగ్ లో విషాదం
- శ్రీనగర్ లో 'హిట్ 3' సినిమా షూటింగ్
- ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న కృష్ణ అనే మహిళ
- గుండెపోటుతో మృతి చెందిన కృష్ణ
ఆమె ఛాతీ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.
కేరళలోని ఎర్నాకులంకు చెందిన కేఆర్ కృష్ణ... సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆమె వయసు 30 ఏళ్లు. ఆమె మృతి పట్ల సినిమా యూనిట్ సంతాపం తెలియజేసింది. ఈ చిత్రంలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమా 2025 మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.