TDP Membership Drive: టీడీపీ సభ్యత్వాలకు రికార్డు స్పందన... మరో 15 రోజులు పొడిగింపు

TDP membership drive extended another 15 days
షార్ట్స్‌లో చూడండి
సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు దాదాపు 94 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 63 రోజుల్లో ప్రతిరోజూ సగటున లక్షన్నర మంది సభ్యత్వం తీసుకున్నారు. 

వాస్తవానికి ఈరోజు (31-12-2024)తో సభ్యత్వ నమోదు గడువు ముగిసినప్పటికీ పండుగ వరకు పొడిగించాల్సిందిగా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు వినతులు అందాయి. పార్టీ కేడర్ తో పాటు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో మరో 15 రోజుల పాటు సభ్యత్వ నమోదు గడువు పెంచాలని అధిష్టానం నిర్ణయించింది.

గతానికి భిన్నంగా ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. నారా లోకేశ్ నేతృత్వంలో దేశంలో మరెక్కడా లేనివిధంగా గత అయిదేళ్ళలో కార్యకర్తల సంక్షేమం కోసం రూ.138 కోట్లు ఖర్చు చేశారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. సభ్యత్వ నమోదులో నెల్లూరు సిటీ 1.46 లక్షల సభ్యత్వాలతో మొదటి స్థానంలో నిలిచింది. 

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం...
1). నెల్లూరు సిటీ - 1,46,966 
2). పాలకొల్లు - 1,44,992
3). ఆత్మకూరు - 1,34,584
4). రాజంపేట - 1,29,783
5). కుప్పం - 1,28,496
6). ఉండి - 1,14,443
7). గురజాల - 1,08,839
8). వినుకొండ - 1,05,158
9). మంగళగిరి - 1,04,122
10). కళ్యాణ దుర్గం - 1,00,325... సభ్యత్వాలతో ముందు వరసలో ఉన్నాయి.
Go Back to Shorts
TDP Membership Drive
Chandrababu
Nara Lokesh
Andhra Pradesh

More Telugu News