పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట
- గోడౌన్ లో బియ్యం మాయమైన వ్యవహారంలో పేర్ని నానిపై కేసు నమోదు
- పేర్ని నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
- తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
పేర్ని నాని పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు పేర్ని నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో, పేర్ని నానికి స్వల్ప ఊరట లభించినట్టయింది.