"మా అత్తను త్వరగా చంపు తల్లీ" అంటూ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు!
అమ్మా... మా అత్తను త్వరగా చంపు తల్లీ అంటూ ఓ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు. ఆ అక్షరాలు కన్నడ భాషలో ఉన్నాయి. పరకామణిలో హుండీ సొమ్మును లెక్కిస్తుండగా ఈ నోటు కంటబడింది. అయితే, అత్తను చంపమని రాసింది కోడలో, మరి అల్లుడో తెలియదు కానీ... ఆ నోటు మాత్రం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.