ఇవన్నీ ఇళయరాజా గొప్పతనాలే: మాధవపెద్ది సురేశ్
- ఇళయరాజా దగ్గర పనిచేశానన్న మాధవపెద్ది సురేశ్
- ఆయన చాలా ఫాస్టుగా కంపోజ్ చేస్తారని వెల్లడి
- రెండు రోజులకో సినిమా పూర్తి చేస్తారని వ్యాఖ్య
- ఇళయరాజా చాలామందిని టాప్ హీరోలను చేశారని వివరణ
"నేను పనిచేసిన సంగీత దర్శకులంతా ఒక ఎత్తు .. ఇళయరాజాగారు ఒక ఎత్తు. వాయిద్యాల పరంగా ఇతర సంగీత దర్శకులు ఉపయోగించే కాంబినేషన్స్ ను ఆయన వాడేవారు కాదు. ఇళయరాజా గారు వన్ మేన్ షో. చాలా ఫాస్టుగా ఆయన కంపోజ్ చేస్తారు. ఉదయం 7 గంటలకు మొదలుపెడితే రాత్రి 9 గంటలలోగా ఒక సినిమాకి సంబంధించిన సగం వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా పూర్తయ్యేది. మిగతా సగాన్ని మరుసటి రోజు చేసేవారు. అందువల్లనే ఆయన 1700 సినిమాల వరకూ చేయగలిగారు" అని చెప్పారు.
"వచ్చిన సినిమాను వచ్చినట్టుగానే అప్పటికప్పుడు చేసేవారు. అలా ఆయన చేసిన సినిమాలు కొన్ని వందలు ఉన్నాయి. ఆయన సంగీతం కారణంగా టాప్ హీరోలు అయినవాళ్లు చాలామంది ఉన్నారు. ఏ వాయిద్యాన్ని ఎక్కడ వాడాలో .. ఎంతవరకూ వాడాలో అనే ఒక ధర్మం ఆయనకి బాగా తెలుసు. ఆయన ఉపయోగించడం వల్లనే కొన్ని వాయిద్యాలకు ఒక ప్రత్యేకత వచ్చిందనేది వాస్తవం. నాతో పాటు చాలామంది సంగీత దర్శకులకు ఆయనే స్ఫూర్తి" అని చెప్పారు.