శ్రీతేజ్‌కు వేణుస్వామి రూ.2లక్షల ఆర్థిక సాయం
- రేవతి భర్త భాస్కర్‌కు రూ. 2లక్షల చెక్కును అందజేసిన వేణుస్వామి
- శ్రీతేజ్ పేరిట మృత్యుంజయ హోమం కూడా చేస్తానని ప్రకటన
- బాధిత కుటుంబానికి 'పుష్ప-2' టీమ్ రూ. 2 కోట్ల భారీ పరిహారం
ఇక బాధిత కుటుంబానికి 'పుష్ప-2' టీమ్ రూ. 2 కోట్ల భారీ పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తరపున రూ. కోటి, మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షలు ఇచ్చారు. రూ. 2 కోట్లకు చెందిన చెక్కులను దిల్ రాజుకు అందజేశారు.
అలాగే శ్రీతేజ్ వైద్యం కోసం సుకుమార్ సతీమణి తబిత రూ. 5లక్షలు అందజేశారు. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ కూడా రూ. 25లక్షల ఆర్థిక సహాయం అందజేసింది.