వితంతు మహిళపై అత్యాచారం.. మాజీ మంత్రి కాకాణి అనుచరుడి అరెస్ట్

Former Minister Kakani Aide Arrest In Rape case
  • ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేసిన వెంకట శేషయ్య
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
  • తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకుని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు
భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న ఓ మహిళపై మాజీ మంత్రి కాకాణి అనుచరుడు లైంగిక దాడి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ పెట్టి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుడు వెంకట శేషయ్యను పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుండడం గమనించి ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకట శేషయ్య లైంగిక దాడి చేశాడు.

అనంతరం రోజూ ఫోన్ చేస్తూ తన కోరిక తీర్చాలని వేధించాడని బాధితురాలు తెలిపింది. తెల్లకాగితంపై సంతకం చేయించుకుని నిత్యం బెదిరించేవాడని ఆరోపించింది. వెంకట శేషయ్య వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఉద్యోగం ఇప్పిస్తానని వెంకట శేషయ్య తనను మోసం చేశాడని, పలుమార్లు తనపై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో సోమవారం రాత్రి వెంకట శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెంకట శేషయ్యను అరెస్టు చేశారని తెలిసి మాజీ మంత్రి కాకాణి అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. దీంతో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు వివరాలను వివరించి అందరినీ అక్కడి నుంచి పంపించివేశారు. ఆపై వెంకట శేషయ్యను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు పూర్తయ్యాక కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.
Go Back to Shorts
Kakani
Former Minister
Kakani Aide
Venkata Sheshaiah
Rape case

More Telugu News