రేపటి నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్న జగన్... షెడ్యూల్ ఇదిగో!
- రేపు పులివెందులకు చేరుకోనున్న జగన్
- 25న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న వైసీపీ అధినేత
- 26న క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్
జగన్ రేపు (డిసెంబరు 24) పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీన సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం తాతిరెడ్డిపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరవుతారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27వ తేదీన పులివెందులలో ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం పులివెందుల పర్యటన ముగించుకుని తిరుగుపయనం అవుతారు.