Game Changer: డాలస్ లో కళ్లు చెదిరేలా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్... ఫొటోలు ఇవిగో!

Game Changer pre release event is US creates history
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ లో భారీ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇటీవలే వచ్చిన పుష్ప-2 చరిత్ర సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే గేమ్ చేంజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్, శంకర్ కలయికలో వస్తున్న గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. నిన్న (డిసెంబరు 21) ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక అమెరికాలోని డాలస్ నగరంలో కళ్లు చెదిరేలా జరిగింది. 

సినిమా రిలీజ్ కు ముందే గేమ్ చేంజర్ ఈ ప్రీ రిలీజ్ వేడుక ద్వారా చరిత్ర సృష్టించింది. ఓ భారతీయ సినిమా అమెరికా గడ్డపై ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోవడం గేమ్ చేంజర్ తోనే ప్రథమం. డాలస్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు అభిమానులు పోటెత్తారు. ఇక్కడి కర్టిస్ కల్వెల్ సెంటర్ క్రిక్కిరిసిపోయింది. పుష్ప-2 దర్శకుడు సుకుమార్ ఈ వేడుకకు హాజరుకావడం విశేషం.
.
Go Back to Shorts
Game Changer
Pre Release Event
Dallas
USA

More Telugu News