18 ఏళ్ల తర్వాత పరిటాల రవి హత్య కేసు నిందితులకు బెయిల్
- ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- 2005లో అనంతపురం జిల్లాలో పరిటాల రవి హత్య
- ప్రధాన నిందితుడు సూరిని కాల్చి చంపిన భానుకిరణ్
అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న పరిటాల రవి హత్య జరిగింది. ఈ కేసు అప్పుడు సంచలనం సృష్టించింది. కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెరువు సూరిని భానుకిరణ్ అనే వ్యక్తి కాల్చి చంపాడు. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు సూరి జైలుకు వెళ్లాడు. అతను బెయిల్ మీద బయటకు వచ్చాక 2011 జనవరి 4న భానుకిరణ్ కాల్చి చంపాడు.