మరో గోడౌన్ పై అనుమానం ఉంది: నాదెండ్ల మనోహర్
- మరో గోడౌన్ లో కూడా తనిఖీలు చేస్తామన్న మనోహర్
- ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని మండిపాటు
- తప్పు చేసిన వాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో గోడౌన్ పై కూడా అనుమానం ఉందని... తనిఖీ చేస్తామని తెలిపారు. ప్రజలకు చెందిన బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను తెలుసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. తప్పు చేసిన వాళ్లు చట్టం చేతుల్లోంచి తప్పించుకోలేరని చెప్పారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని అన్నారు.