అమ్మతో హ్యాపీగా.. ట్రెండింగ్‌లో బన్నీ స్పెషల్ ఫొటో..!
- తన తల్లి నిర్మలతో దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్న బన్నీ
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
- తమదైనశైలిలో స్పందిస్తున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్
- ఇటీవల 'పుష్ప2'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఆనందంలో అల్లు అర్జున్
ఇదిలాఉంటే... తాజాగా బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ తన తల్లి నిర్మలతో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
అద్భుతమైన విజయాన్ని అందుకున్న కుమారుడిని చూసి నిర్మల గర్వంగా ఫీలవుతూ సంతోషంలో కనిపించగా... బన్నీ తన తల్లిని చూసి ఆనందంలో మునిగిపోయినట్లు ఆ ఫొటో ఉంది. "బ్యూటిఫుల్ మార్నింగ్. బిగ్ డే... బ్యూటిఫుల్ స్టార్ట్" అనే లైన్స్‌తో ఐకాన్ స్టార్ ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడీ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై బన్నీ ఫ్యాన్స్ తమదైనశైలిలో స్పందిస్తున్నారు.