ఆరు రోజుల పుష్ప-2 హిందీ వసూళ్లు ఎంతో తెలుసా?
- హిందీలో పుష్ప-2 సరికొత్త రికార్డు
- 6 రోజుల్లోనే రూ.375 కోట్లు వసూళ్లు
- హిందీలో రూ.700 కోట్లు కలెక్షన్లు సాధిస్తుందని అంచనా
ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో రికార్డుల మోత మ్రోగించి విడుదల తరువాత కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు విడుదలైన రోజు నుంచి ఈ చిత్రం వసూళ్ల విషయంలో ప్రతి రోజు రికార్డులను నెలకొల్పుతుంది. ఈ రోజు సాయంత్రానికి ఈ చిత్రం రూ.1000 కోట్ల వసూళ్ల సాధించిన చిత్ర జాబితాలో చేరనుంది.
కాగా ఈ చిత్రానికి హిందీలో, ఉత్తరాధిలో వసూళ్ల సునామి కొనసాగుతుంది. హిందీలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. తాజాగా కేవలం ఆరు రోజుల్లో హిందీలో రూ.375 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. మిగతా భాషలతో పోల్చుకుంటే నార్త్‌లో ఈ చిత్రానికి లభించిన ఆదరణ చూస్తుంటే ట్రేడ్ పండితులు ఆశ్చర్చపోతున్నారు.
కేవలం వారాంతంలోనే కాకుండా వారంలో మొదటి రోజుల్లో కూడా పుష్ప-2 అత్యధిక కలెక్షన్లు సాధిస్తోంది. కేవలం హిందీలోనే పుష్ప-2 రూ. 700 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం వుందని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు
.