అంబటి రాంబాబు సోదరుడికి షాక్.. షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వం
- గుంటూరులోని పట్టాభిపురంలో గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్న అంబటి మురళీకృష్ణ
- రైల్వేశాఖ నుంచి జీ ప్లస్ 4కు మాత్రమే అనుమతి
- అగ్నిమాపకశాఖ, పీసీబీ నుంచి కూడా సరైన అనుమతులు తీసుకోని వైనం
- గత నెల 18న నిర్మాణదారుడికి షోకాజ్ నోటీసులు
గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్‌కు జీ ప్లస్ 4కు మాత్రమే రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. అయితే, అనుమతులను ఉల్లంఘించి అంతకుమించి అంతస్తులు నిర్మిస్తున్నట్టు గతేడాది గుర్తించిన రైల్వే ఎన్‌వోసీని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ నిర్మాణంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర ప్రశ్నించడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. పలు ఉల్లంఘనల నేపథ్యంలో గత నెల 18న షోకాజ్ నోటీసులు పంపిన నగర పాలక సంస్థ అధికారులు గతంలో ఇచ్చిన అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కోరింది. మరోవైపు, రైల్వేశాఖ ఎన్‌వోసీ ఇవ్వడం లేదంటూ నిర్మాణదారుడు హైకోర్టును ఆశ్రయించడంతో రెండువారాల వరకు నిర్మాణాలపై ఎలాంటి చర్యలు వద్దని నగరపాలక సంస్థను హైకోర్టు ఆదేశించింది.