Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

upsc mains result 2024 out
Advertisement
  • మొత్తం 1056 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్
  • జూన్ 16న ప్రిలిమ్స్, జులై 1న ఫలితాల వెల్లడి
  • సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన యూపీఎస్సీ 
Advertisement
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ) సోమవారం విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఇంటర్వ్యూ అర్హత సాధించిన అభ్యర్ధుల హాల్‌టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. 

ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిపికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు. ఆ తర్వాత ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించిన అధికారులు .. తాజాగా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. 

త్వరలో నిర్వహించే ఇంటర్వ్యూలో సత్తా చాటిన వారిని ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) సర్వీసులకు ఎంపిక చేస్తారు.  
Advertisement
Advertisement
upsc
upsc mains results

More Telugu News