గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయలేం: తెలంగాణ హైకోర్టు
- గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని పిటిషన్లు
- ఏర్పాట్లు పూర్తయినందున వాయిదా వేయలేమన్న హైకోర్టు
- అభ్యర్థులు హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారన్న టీజీపీఎస్సీ
విచారణ అనంతరం వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారని, కాబట్టి వాయిదా వేయలేమని స్పష్టం చేసింది.
గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తే లక్షల మంది విద్యార్థులు నష్టపోతారని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టివేసింది.