Pushpa2: కొనసాగుతున్న పుష్ప-2 వేట... రెండో రోజు మరో ఆల్ టైమ్ రికార్డు

Pushpa2 set another all time record by collecting Rs 449 cr in just two days
షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటిచెబుతున్న చిత్రం పుష్ప-2 ది రూల్. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

తొలి రోజు రూ.294 కోట్లతో భారతీయ సినీ చరిత్రలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన పుష్ప-2... రెండ్రోజుల్లో రూ.449 కోట్లతో మరో రికార్డు సెట్ చేసింది. రెండ్రోజుల్లోనే ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రం మరొకటి లేదు. అత్యంత వేగంగా రూ.449 కోట్లు కొల్లగొట్టిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప-2 చరిత్ర సృష్టించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.
Go Back to Shorts
Pushpa2
All Time Record

More Telugu News