కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

Revanth Reddy tweet
  • ఆశయాలు, ఆకాంక్షలన్నింటినీ కలిపి తెలంగాణ తన చేతుల్లో పెట్టిందన్న రేవంత్
  • రాష్ట్రాన్ని సమున్నతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించిందని వ్యాఖ్య
  • విరామం ఎరుగక.. విశ్రాంతిని కోరక ముందుకు సాగిపోతున్నానన్న సీఎం
తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. 

"పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను... ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను... అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి... డిసెంబర్ 7, 2023 నాడు... తెలంగాణ నా చేతుల్లో పెట్టింది. తన వారసత్వాన్ని సగర్వంగా... సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించింది. 

ఆ క్షణం నుండి... జన సేవకుడిగా... ప్రజా సంక్షేమ శ్రామికుడిగా... మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో... సకల జనహితమే పరమావధిగా... జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా... సహచరుల సహకారంతో... జనహితుల ప్రోత్సాహంతో... విమర్శలను సహిస్తూ... విద్వేషాలను ఎదురిస్తూ... స్వేచ్ఛకు రెక్కలు తొడిగి... ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి... అవనిపై అగ్ర భాగాన... తెలంగాణను నిలిపేందుకు... గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ... నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ... నిరంతరం జ్వలించే... ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా... విరామం ఎరుగక... విశ్రాంతి కోరక... ముందుకు సాగిపోతున్నాను. ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి... సమస్త ప్రజల ఆకాంక్షలు... సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి" అని ట్వీట్ చేశారు.
Advertisement
Revanth Reddy
Congress

More Telugu News