అల్లు అర్జున్.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది: ప్రకాశ్ రాజ్
- బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తున్న 'పుష్ప-2'
- అల్లు అర్జున్ నటనపై పలువురి ప్రశంసలు
- అల్లువారబ్బాయిని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాశ్ రాజ్
- బన్నీ స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదిగారని కితాబు
తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా అల్లువారబ్బాయిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదిగారని కొనియాడారు. అలాగే పుష్ప చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెప్పారు. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.
"గంగోత్రి నుంచి పుష్ప-2 వరకూ చూస్తున్నాను. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న తీరు అత్యద్భుతం. చాలా గర్వంగా ఉంది. ఇలాగే మరింత ముందుకెళ్లండి. మూవీ టీమ్ అందరికీ కంగ్రాట్స్. మాంత్రికుడు సుకుమార్‌కి స్పెషల్ లవ్" అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.